క‌రోనా ఎఫెక్ట్‌: దేశంలో చారిత్ర‌క క‌ట్ట‌డాలు మూత‌!

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొవిడ్ ఉగ్ర‌రూపం ధ‌రించి క‌ల్లోలం సృష్టిస్తోంది. భారీగా ప్రాణాల‌ను హ‌రిస్తోంది. బుధ‌వారం 2 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు, వెయ్యికి పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఈ మేర‌కు గురువారం కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

ఈ నేప‌థ్యంలో కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్ర‌క క‌ట్ట‌డాలు, స్మార‌క స్థ‌లాలు, మ్యూజియాల‌ను తాత్క‌లికంగా మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ్య‌స్తాయ‌ని జియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. కేంద్రం ఆధీనంలో ఉండే చారిత్ర‌క క‌ట్ట‌డాలు, స్మార‌క స్థ‌లాలు, మ్యూజియాల‌ను మే 15 వ‌ర‌కు తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.