బైకును ఢీకొట్టిన డిసిఎం.. ఇద్ద‌రి మృతి

వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో శుక్ర‌వారం ఉద‌యం రోడ్డు ప్రమాదం జరిగింది. మండ‌లంలోని చిన్న‌బండ తండా వ‌ద్ద ఓ బైక్‎ను డిసిఎం వాహ‌నం ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో బైక్‌పై ‌వెళ్తున్న‌ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతులు బొంరాస్‎పేట మండలానికి చెందిన శివ, మల్కయ్యగా గుర్తించారు. ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.