భారీ న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్‌లు..!

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. క‌రోనా ఉధృతి.. సంబంధిత ఆంక్ష‌లు, లాక్‌డౌన్‌ల నేప‌థ్యంలో మదుప‌ర్లు తీవ్ర ఆందోళ‌న‌కు గురయ్యారు. ఫ‌లితంగా ఉద‌యం 47,940 వ‌ద్ద ప్ర‌తికూలంగా ప్రారంభ‌మైన స‌న్సెక్స్ ఓ ద‌శ‌లో 1,470 పాయింట్లు కుప్ప‌కూలి 47,362 వ‌ద్ద న‌ష్టాన్ని తాకింది.

అదేవిధంగా 14,306 వ‌ద్ద ట్రేడిండ్ ప్రారంభించిన నిఫ్టీ 426 పాయింట్లు దిగ‌జారి 14,191 వ‌ద్ద ఇంట్రాడే క‌నిష్టాన్ని న‌మోదు చేసింది. అదేవిధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.65 వద్ద కొనసాగుతున్న‌ది.

నిఫ్టీలో విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సిప్లా షేర్లు లాభాల్లో పయనిస్తుండగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్ ‌అండ్ ‌టీ, బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని కంపెనీలు నష్టాల్లో పయనిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.