ఏప్రిల్ 15 నుండి జాతీయ రహదారులపై కొత్త ఫీజు వసూలు
ఢిల్లీ (CLiC2NEWS): జాతీయ రహదారులపై ఈ నెల 15 నుండి కొత్త ఫీజు విధానం అమలులోకి రానుంది. రహదారులపై ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు విధించే జరిమానాలను కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. వాహనానికి అనుమతించిన బరువుకంటే అధనంగా ఉన్న భారాన్ని బట్టి జరిమానా వసూలు చేయనున్నారు.
10% వరకు ఓవర్‌లోడ్‌కు ఎటువంటి జరిమానా ఉండదు.
10%-40% వరకు ఓవర్‌లోడ్‌కు సాధారణ టోల్ రుసుము కంటే 2 రెట్లు అధికంగాయ వసూలు చేయనున్నారు.
40% కంటే ఎక్కవ లోడ్ ఉంటే టోల్ రుసుం కంటే 4 రెట్లు అధికంగా వసూలు చేయనున్నారు.
రహదారుల భద్రతను పెంపొందించడం, రహదారి మౌలిక సదుపాయాలను రక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.