తెలంగాణలో కొత్తగా 5,926 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1,22,143 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 5,926 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కి పెరిగింది. తాజాగా మహమ్మారి బారినపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి వైరస్‌ బారినపడి మొత్తం 1,856 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,209 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ నుంచి 3,16,650 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 42,853 యాక్టి్‌వ్‌ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 793 జీహెచ్‌ఎంసీలోనే ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.