TS Corona: కొత్తగా 4,826 కేసులు.. 32 మంది మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 65,923 నమూనాలను పరీక్షించగా కొత్తగా 4,826 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం సాయంత్రం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,02,187కి చేరాయి.
వైరస్ బారినపడిన వారిలో తాజాగా 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు. ఇవాళ్టివరకు 2771 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 62,797కు పెరిగాయి.