Telangana: 10 రోజులు లాక్‌డౌన్‌

మంత్రివ‌ర్గ నిర్ణ‌యం

హైదరాబాద్ (CLiC2NEWS): లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టి నుంచి 10 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌గ‌తిభ‌న్‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధ్య‌క్షుత‌న స‌మావేశ‌మైన కేబినెట్ క‌రోనా నేప‌థ్యంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

రేప‌టి (మే 12 నుంచి 22వ తేదీ వ‌ర‌కూ)నుంచి ప‌దిరోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది. ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్‌డౌన్‌ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. నిత్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు ఈ స‌మ‌యంలో వెసులుబాటు క‌ల్పించారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు కానుంది. ఈ స‌మ‌యంలో దాదాపు అన్ని కార్య‌క‌లాపాలు నిలిచిపోనున్నాయి. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. అలాగే వ్యాక్సిన్ కొర‌త నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబ‌ర్ టెండ‌ర్ల‌ను పిల‌వాల‌ని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణయించింది.

Leave A Reply

Your email address will not be published.