కొద్దిసేపట్లో లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రేపట్నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి.
లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (మే 12 నుంచి 22వ తేదీ వరకూ)నుంచి పదిరోజుల పాటు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగతా 20 గంటలు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు.