India Corona: 3 ల‌క్ష‌ల దిగువ‌కు కొత్త‌కేసులు.. 4016 మరణాలు

న్యూఢిల్లీ: (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ ఉధృతి కొన‌సాగుతోంది. పాజిటీవ్ కేసులు గ‌త రెండు రోజులుగా త‌గ్గుతున్నా మ‌ర‌ణాల సంఖ్య మాత్రం త‌గ్గ‌డంలేదు. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 2,81,386 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ సోమ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 4,106 మంది మృతి చెందారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,74,390కి చేరింది. గ‌డిచిన 24 గంటల్లో దేశంలో 3,78,741 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 2,11,74,076 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 35,16,997 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.