India Corona: భారీగా తగ్గిన కేసులు..
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 22,17,320 కొవిడ్ టెస్టులు నిర్వహించగా 2,08,921 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగాయి. కొత్తగా 2,95,955 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 2,43,50,816 మంది కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 4,157 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు దేశంలో వైరస్ బారినపడి మొత్తం 3,11,388 మంది కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 24,95,591 యాక్టివ్ కేసులున్నాయి.