తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం

హైద‌రాబాద్ (CLiC2NEWS): నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో తెలంగాణ రాష్ట్రంలో ప‌లుచోట్ల వ‌ర్షం కురుస్తోంది. ప‌లు చోట్ల తెల్ల‌వారుజాము నుంచి ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. ఇవాళ బుధ‌వారం తెల్లవారు జాము నుంచి క‌రీంన‌గ‌ర్, ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసింది. క‌రీంన‌గ‌ర్‌లోని హుజూరాబాద్‌, జమ్మికుంట‌, వేముల‌వాడ‌, శంక‌ర‌ప‌ట్నం, సైదాపూర్‌లో భారీ వ‌ర్షం కురిసింది. ఇక ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడ‌తెల‌పిలేని వ‌ర్షం కురుస్తోంది. కామారెడ్డిలోనూ భారీ వ‌ర్షం కురిసింది.

ముంబ‌యిలో జోరు వానలు

ఈ నెల 9 నుంచి 13 వరకు ముంబ‌యితోపాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని భార‌త వాతావ‌రణ కేంద్రం హెచ్చరించింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ 10న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, అయితే అవి ఈసారి కాస్త ముందుగా వచ్చేశాయని ఐఎండీ ముంబై డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డా. జయంత సర్కార్‌ వెల్లడించారు. ముంబైలోని కొలాబా, శాంతాక్రజ్‌లో నిన్న ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల వరకు 65.4 మిల్లీమీటర్లు, 50.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది.

Leave A Reply

Your email address will not be published.