India Corona: కొత్తగా 92,596 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 92,596 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 2,90,89,069కి చేరింది.
గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,62,664 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజా డిశ్చార్జీలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మొత్తం 2,75,04,126 మంది కోలుకొని రికవరీ అయ్యారు.
గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2219 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 3,53,528కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,31,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి.