TS: హైకోర్టు విజ్ఞ‌ప్తికి సిజెఐ ఎన్వీ రమణ ఆమోదం..

నెరవేరనున్న హైకోర్టు కల

హైదరాబాద్‌ (CLiC2NEWS): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీరమణ చొరవతో తెలంగాణ హైకోర్టు చిరకాలవాంఛ నెరవేరనుంది. న్యాయ‌మూర్తుల సంఖ్య పెంచాల‌ని కోరుతూ… తెలంగాణ హైకోర్టు గత రెండేళ్లుగా చేస్తున్న విజ్ఞప్తికి సీజేఐ ఆమోదం తెలిపారు.

దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల‌ను జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌రిశీలిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీజేఐ ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతానికి పెంచారు.

ఇక‌పై తెలంగాణ హైకోర్టులో న్యాయ‌మూర్తుల సంఖ్య 42కు చేర‌నుంది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల‌ను సాధ్య‌మైనంత త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌నే త‌లంపుతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సిజెఐ కార్యాల‌యం వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.