Mandapeta: 100 మంది పేద‌ల‌కు నిత్యావసర స‌రుకుల‌ పంపిణీ..

జమాతే ఇస్లామీ హింద్, ఎస్ ఐ ఓ, చేయూత స్వ‌చ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ

మండపేట (CLiC2NEWS): కరోనా రెండవ దశ విజృంభిస్తున్న వేళ కరోనా మృతులకు అంత్యక్రియలు, ఆక్సిజన్ సిలిండర్లు, వైరస్ బాధితుల‌కు ఆహారం, మందులు ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ క‌ష్ట‌కాలంలో సామాన్యుల‌కు అండ‌గా ఉంటున్న‌ జమాతే ఇస్లామీ హింద్, ఐ ఎస్ ఓ సంస్థ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందజేసింది. బుధవారం జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ఇమ్రాన్ షరీఫ్, మండపేట స్టూడెంట్ ఇస్లామీక్ ఆర్గనైజేషన్ (ఎస్ ఐ ఓ), చేయూత స్వచ్చంద సేవ సంస్ద సంయుక్తంగా ఆధ్వర్యంలో 100 మంది కి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.  స్దానిక‌ చిన్న మశీదు వద్ద ఎస్ ఐ ఓ కార్యలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జమాత్ స్దానిక అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఐ ఓ, చేయూత అధ్యక్షులు వసీం, సోహైబ్ లు ఇలాంటి కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించడం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. రేషన్ లేక ఇబ్బంది‌ పడుతున్నా వారిని గుర్తించి సుమారు 100 మందికి రేషన్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో‌ చిన్నా, లోకేష్, షోఐబ్, ఒసామా, జమాత్ సభ్యులు ఇబ్రహీం షరీఫ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.