ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను పరామర్శించిన సిఎం కెసిఆర్
మెట్పల్లి (CLiC2NEWS): జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బుధవారం తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి బాల్క సురేష్ చిత్రపట వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించారు. బాల్క సురేష్ (62) అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారి తండ్రి సురేష్ గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. ఈ రోజు రేగుంట(మెట్ పల్లి)లోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. pic.twitter.com/SQ8y80FFYL
— TRS Party Chennur (@trspartychennur) June 9, 2021