ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం
హైదరాబాద్ (CLiC2NEWS): మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి శనివారం ఉదయం రాజీనామా చేశారు. కాగా ఈటల రాజీనామాను కాసేపటి క్రితమే తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు.
ఇవాళ ఉదయం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్)కు గుడ్‌బై చెప్పిన ఆయన తాజాగా శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. శనివారం శామీర్‌పేటలోని తన ఇంటినుంచి మద్దతుదారులతో కలిసి ముందుగా గన్‌పార్క్ చేరుకొని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మేట్లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు.