వ్యాక్సిన్లు పేద దేశాలకు ఇవ్వండి..
జెనీవా (CLiC2NEWS): ప్రపంచంలోని పేద దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్లు అందివ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ ధనిక దేశాలను కోరారు. వ్యాక్సినేట్ అయిన సంపన్న దేశాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని అన్నారు. కానీ పేద దేశాలకు ఇంకా కరోనా వ్యాక్సిన్లు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ టీకాల పంపిణీలో ప్రపంచవ్యాప్తంగా విఫలమైనట్లు టెడ్రోస్ తెలిపారు. కాగా జెనీవాలో మీడియాతో మాట్లాడిన టెడ్రోస్.. అతి పేద దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో కొన్ని అగ్రదేశాలు విఫలమైనట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల సరఫరా సమస్యగా మారిందని, ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటూ ఆయన వేడుకున్నారు.