TS: ముఖ్య‌మంత్రి కెసిఆర్‌తో ఎల్ ర‌మ‌ణ భేటీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావుతో తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌ ర‌మ‌ణ భేటీ అయ్యారు. ఇవాళ (గురువారం) మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో క‌లిసి ఎల్ ర‌మ‌ణ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం ద‌యాక‌ర్ రావుతో ర‌మ‌ణ ప‌లు అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంత‌రం రమ‌ణ‌.. టీఆర్ఎస్ పార్టీలో చేరే అంశంపై స్ప‌ష్ట‌త రానుంది.

Leave A Reply

Your email address will not be published.