14న తోటకు దళితుల అభినందన సభ..

మండపేట (CLiC2NEWS): శాసన మండలి సభ్యునిగా నియమితులైన తోట త్రిమూర్తులకు ఈనెల 14వ తేదీన నియోజకవర్గ దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ దళిత ఐక్యవేదిక నేతలు ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, ఏఎంసీ వైస్ చైర్మన్ సాదే పిడుగురాముడు, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు తెలిపారు. స్థానిక సూర్య గ్రాండ్స్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

దళితుల అభ్యున్నతికి, పేదల సంక్షేమానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన సత్కారం చేయడానికి భారీ ఎత్తున అభినందన సభ ఏర్పాటు చేశామని అన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో అభినందన సభ ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.

తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల దళిత దళిత సంఘాల నేతలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అభినందన సభకు నియోజక వర్గంలో ఉన్న దళితులంతా విచ్చేసి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలపునిచ్చారు. బూరిగ జానీ, మాజీ ఎంపీటీసీ తుపాకుల ప్రసన్న కుమార్, పలివెల సుధాకర్, పలివెల మధు, నక్కా సింహాచలం, మందపల్లి రుద్రకాంత్, మందపల్లి సుధాకర్, మందపల్లి సంజీవరావు, గనిపే నాగ భూషణం, చిక్కాల రాంబాబు, మోర్త శ్యామ్ ప్రసాద్, కొడమంచిలి భాస్కరరావు, కాకాడ నూకరాజు, 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మాజీ కౌన్సిలర్ కొల్లి వరలక్ష్మి, పొలమాల సత్తిబాబు, కనికెళ్ల ప్రసాద్, సన్మాల ధనరాజు, కొమరపు సత్యనారాయణ, వల్లూరి రామకృష్ణ,నేల సూర్యకుమార్, మల్లిపూడి శివ, ములకా అప్పారావు, బూరిగ ఆనందరావు, గనిపే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.