సింగరేణి అధికారులు, కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): సింగరేణి యాజమాన్యం.. అధికారులకు కార్మికులకు గుడ్న్యూస్ చెప్పింది. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ఈ మేరకు ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు.
కాగా ఈ వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశానుసారం పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెళ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలకూ కారుణ్య నియామకాల్లో అవకాశం దక్కనుంది.