TS: మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం!
చౌటుప్పల్ (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కొత్తరేషన్‌కార్డుల పంపినీ కార్యక్రమం రసాభాసగా మారింది. చౌటుప్పల్ మండలం లక్కారంలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తుండగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అడ్డుకున్నారు. ఒక దశలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోంచి మైక్ లాక్కోవడం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు నినానాదాలు చేశారు. ఈ దశలో 60 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో కాంగ్రెస్, తెరాస కార్యకర్తలను పోలీసులు బయటకు పంపించారు.