Jammu and Kashmir: ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హ‌తం

శ్రీనగర్‌ (CLiC2NEWS): జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో శ‌నివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ ఎదురు కాల్పులు ఇవాళ‌ ఉద‌యం నాగ్‌బేరన్‌-తర్సార్‌ అటవీ ప్రాంతంలో జ‌రిగాయ‌ని పోలీసులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నార‌న్న ప‌క్కా సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంద‌ర్బంగా ఉగ్రవాదులు ఒక్క‌సారిగా భ‌ద్ర‌తాద‌ళాల‌పై కాల్పులకు తెగబడ్డారు. వెంట‌నే అప్ర‌మత్త‌మైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపార‌ని ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మ‌ర‌ణించార‌ని వారు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ముమ్మ‌రంగా గాలింపు చేప‌ట్టిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.