ఏపీలో కొత్తగా 8,835 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8835 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనాతో మరో 64 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,92,760కు చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,97,376 మంది కోలుకున్నారు. ఏపీలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5105కు పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 10845 మంది కోలుకోగా.. 64 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం6, అనంతపురం 5, కడప 5, కృష్ణా 4, తూర్పుగోదావరి 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5105కి చేరింది.
