రైతన్నల శ్రేయస్సే తెలంగాణ సర్కార్ లక్ష్యం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): రైతుల శ్రేయస్సు పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులను చూడాలనేదే తెలంగాణ సర్కార్ సంకల్పం అని మంత్రి స్పష్టం చేశారు.
2014 సంవత్సరంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానం మేరకు.. 35.19 లక్షల మంది రైతులకు రూ. 16144.10 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు.
అలాగే 2018లో కూడా రైతుల రుణమాఫీ కోసం వాగ్దానం ఇచ్చాం. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం తన వాగ్దానం మేరకు రూ. 50 వేల వరకు రుణమాఫీ ద్వారా 9 లక్షల మంది రైతులకు సాయం చేశామని తెలిపారు.
రుణమాఫీ చేసిన తెలంగాణ సిఎం కెసిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
We made a similar commitment to our farmers in 2018. Yet again, even in the midst of pandemic, Telangana Govt has kept its promise & helped more than 9 lakh farmers by waiving off loans up to ₹50 K
Kudos to Hon’ble CM KCR Garu & Agriculture Minister @SingireddyTRS Garu 🙏
— KTR (@KTRTRS) August 21, 2021