సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్‌రావు

దుబ్బాక: సిద్దిపేట, దుబ్బాక లు తనకు రెండు కళ్ళ లాంటివి అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ప్రజలకు అన్నీ వేళలా అందుబాటులో ఉండి సిద్దిపేట మాదిరే దుబ్బాక ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. బుధవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అధునాతన ట్విన్ టాయిలెట్స్ ను, రూ.85 లక్షలతో నిర్మించిన వెజ్, నాన్ -వెజ్ మార్కెట్ ను మంత్రి ప్రారంభించారు.
ఆ వెంటనే రూ.80 లక్షలతో పలు వార్డులలో నిర్మించనున్న మురుగు కాల్వల నిర్మాణం పనులకు మంత్రి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి గత సంవత్సరం చింతమడక వచ్చినప్పుడు దుబ్బాక పై ప్రేమతో రూ.10 కోట్ల ప్యాకేజీ నీ ప్రకటించార నీ అన్నారు. గతంలో కూడ రూ.25 కోట్ల ప్యాకేజీ నీ ప్రకటించార నీ తెలిపారు. దుబ్బాక లో చదువు కున్నాను, పెరిగాను అన్న ఉద్దేశ్యంతో మున్సి పాలిటి అభివృద్ధి కోసం రూ.35 కోట్ల ప్యాకేజీ నీ ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. అలాగే దివంగత శాసన సభ్యులు రామలింగా రెడ్డి కోరిక మేరకు ఫైర్ స్టేషన్ ను మంజూరు చేశారని అన్నారు. దుబ్బాక పాత పట్టణం చిన్న చిన్న గల్లీలు, రాళ్లతో కట్టిన మురుగు నీటి కాల్వలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వార్డుకు రూ.10 లక్షలు వెచ్చించి పాత మురుగు నీటి కాల్వల స్థానంలో RC మురుగు నీటి కాల్వల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గతంలో దుబ్బాకలో తీవ్ర తాగు నీటి సమస్యలు ఉండేవన్నారు. మహిళలు ట్యాంకర్ల వెనుక పరిగెత్తి త్రాగు నీటి నీ తెచ్చుకునే వారన్నారు. సీఎం ప్రత్యేక చొరవతో త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందా మన్నారు. 70 ఎండ్లుగా దుబ్బాక నియోజక వర్గం ప్రజలు సాగునీటి , త్రాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారని మంత్రి అన్నారు. ఇప్పటికే త్రాగునీటి సమస్యలకు పరిష్కారం చూపగా త్వరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూప నున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే దాదాపుగా దుబ్బాక నియోకవర్గo లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వచ్చే 7 నెలల్లో పిల్ల కాల్వల పనులు పూర్తి చేసి నియోజక వర్గంలో 1 లక్షా 35వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని మంత్రి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో 20 వేల మంది బీడి కార్మికులకు జీవనభృతి అందిస్తున్నామన్నారు. గతంలో రెండు వందల పింఛన్‌ను రెండువేలకు పెంచిన ఘనత తమదేనన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 56,906 మంది వృద్ధులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గం, దుబ్బాక పట్టణ అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన విశేష కృషి చేశారని మంత్రి కొనియాడారు. వారి స్ఫూర్తితో దుబ్బాక ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి తెలిపారు. దుబ్బాక లో త్వరలోనే టౌన్ హాల్ నిర్మాణం చేపడ తామన్నారు. అలాగే దుబ్బాక లో పేదల కోసం 800 రెండు పడక గదుల ఇండ్లు నిర్మించామని, ఎక్కడా లేని విధంగా రూ.15 కోట్లతో పాఠశాల,కళాశాల భవనం ను నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరిక మేరకు రెండు పడక గదుల ఇండ్లు, పాఠశాల,కళాశాల భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుపుతామన్నారు. రామ సముద్రం చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజామిల్ ఖాన్, మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ వనిత, కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.