ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ ఎన్నిక‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ ఎన్నిక‌యినట్లు సొసైటీ యాజ‌మాన్య క‌మిటీ ప్ర‌క‌టించింది. త‌మ విన్న‌పాన్ని మ‌న్నించి అధ్య‌క్షుడిగా ఉండేందుక అంగీక‌రించినందుకు క‌మిటీ స‌భ్యులు హ‌రీష్‌రావును ఆయ‌న నివాసంలో క‌లిసి ద్య‌న్నవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషిచేస్తానని హరీశ్‌ రావు అన్నారు. అందరం కలిసి సొసైటీని ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. గత 80 ఏండ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామన్నారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని వెల్లడించారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా వారిని తీర్చిదిద్దుదామని మంత్రి హ‌రీశ్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.