కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే క‌రోనా ప‌లురాష్ట్రాల‌కు చెందిన మంత్రుల‌ను, ప‌ల‌వురు కేంద్ర మంత్రుల‌కు పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మ‌హమ్మారి సామాన్యులు, నాయ‌కులు అన్న తేడా లేకుండా అంద‌రిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తోంది. తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ అని తేలింది. అనారోగ్యంతో వైద్యుడిని సంప్రదించి టెస్ట్‌ చేసుకోగా పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘నిన్న నాకు కాస్త అనారోగ్యంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాను. అనంతరం కోవిడ్-19 టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాను. నాకు సన్నిహితంగా మెదిలిన వారు జాగ్రత్తగా ఉండాలని విజ్ణప్తి చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి’’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో నితిన్ గడ్కరీ రాసుకొచ్చారు.

 

 

Leave A Reply

Your email address will not be published.