India Corona: కొత్తగా 27,254 కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు 30 వేల లోపు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 27,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175కు చేరింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 37,687 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.
- ఇప్పటి వరకు దేశంలో 3,24,47,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ప్రస్తుతం దేశంలో 3,74,269 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 219 మంది మృతిచెందారు.
- ఇప్పటి వరకు దేశంలో 4,42,874 మంది బాధితులు మరణించారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో 20,240 కేసులు ఉన్నాయని, కొత్తగా 67 మంది మృతిచెందారని వెల్లడించింది.
- గత 24 గంటల్లో 53,38,945 మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
- ఇప్పటివరకు దేశంలో మొత్తం 74,38,37,643 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశామని వెల్లడించింది.