దేశంలో కొత్తగా 34,403 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో వరుసగా రెండో రోజూ 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 34,403 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కు చేరింది.
- ప్రస్తుతం దేశంలో 3,49,056 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- ఒక్క రోజులో దేశంలో 37,950 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
- ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,25,98,424 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 320 మంది మృతి చెందారు.
- దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,44,248 మంది కరోనాతో మృతి చెందారు.
- ఇక దేశంలో 77.24 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
Wow, marvelous blog format! How lengthy have you ever been running a blog for? you made running a blog glance easy. The whole look of your web site is great, as neatly as the content!!