అంతర్జాతీయ శాంతి దినోత్సవం..

మన మానవ జన్మ
మానవతా పరిమళాలకు నెలవు కావాలి..!

అహింస, శాంతి,సోదరభావాలు పూల మాలలై,
విశ్వమానవ కల్యాణానికి స్వాగత తోరణాలు
కావాలి..!

పుడమి తల్లి శాంతి పరిమళాలు వెదజల్లే
నిర్విరామ శ్రామికులము కావాలి..!

ప్రపంచ శాంతి ఇంకా నీటిమీద రాతల్లా కారాదు అని..
శాంతి కపోతాలు ఎగరవేసి నిజమైన శాంతికి మార్గం తెరవాలని పుడమి తల్లి కోరికను ప్రతీ ఒక్కరు నెరవేర్చాలి

-‍‍‍‍మంజుల పత్తిపాటి.

Leave A Reply

Your email address will not be published.