`27న జరిగే విద్యాసంస్థ ల బంద్ ను జయప్రదం చేయండి`
భూపాలపల్లి (CLiC2NEWS): ఈనెల 27న జరిగే విద్యాసంస్థ ల బంద్ విజయ వంతం చెయ్యాలి అని అఖిలపక్ష విద్యార్థీ సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు ఈరోజు విద్యార్థి సంఘల అఖిల పక్ష సమావేశం sfi జిల్లా నాయకులు ముత్తి రెడ్డి దేవేందర్ రెడ్డి గారి అధ్యక్ష తన జరిగింది. ఈ సందర్బంగా SFI జిల్లా కార్యదర్శి దామెర కిరణ్ NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ ,PDSU ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి బస్సా శివ కుమార్ మాట్లాడుతూ.. దేశం లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం మే పనిగా పెట్టుకుందని వారు వాపోయారు ఈ దేశానికి వెన్నెముక అయిన రైతు అంటూనే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పటం కోసం మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చిందని వారు అన్నారు. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి నూతన విద్యా విధానం అంటూ విద్యారంగంలో ముడత్వం ను పెంచి పోషిస్తూ ఉండేవిధంగా ఎన్ని ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది అన్నారు. దీనివల్ల పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్షల ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఇచ్చే విధంగా గా ఈ కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి విధానాలను పూర్తిగా పేద ప్రజల యొక్క జీవితాలను తాకట్టు పెట్టడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పై ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ నెల 27వ తేదీన భారత్ బంద్ లో భాగంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నూతన విద్యా విధానం వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష విద్యార్థి సంఘాల అధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అన్నారు. ఇట్టి బందుకు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రిన్సిపాల్స్ విద్యార్థులు అందరూ జయప్రదం చెయ్యాలి అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా నాయకులు ప్రణయ్, , స్మరన్ ,AISF నాయకులు జసద్, PDSU నాయకులు,కంకణ ల దేవేందర్ తదితర్లు పాల్గొన్నారు.