ముంబయిలో భారీ వర్షాలు
24 గంటల్లో 280 మి.మీల వర్షపాతం నమోదు
ముంబయి : దేశ ఆర్ధిక రాజధాని ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటల్లో 280 మీమీకు పైగా వర్షపాతం నమోదుకాగా, రానున్న 24 గంటల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు హెచ్చరించారు. మంగళవారం రాత్రంతా కురిసిన భారీ వర్షాలతో నగరంలో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మరోవైపు సెంట్రల్, హర్భర్ లైన్లన్నీ కూడా నీటితో నిండిపోవడంతో ట్రైన్ సర్వీసులను కూడా రద్దు చేశారు. అనేక ఆసుపత్రుల్లోకి నీరు చేరింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే బాంబే హైకోర్టులో బుధవారం కార్యకలాపాలను, విచారణలను నిలిపివేశారు. విద్యుత్, నీటి సరఫరాలు నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక ప్రాంతాల్లో నివాసాలు నీటి మునిగిపోవడంతో ప్రజల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

వాహనాలు ఎక్కడక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. బుధవారం 8:30 గంటలకు గత 24 గంటల్లో పశ్చిమ సుబుర్స్ ప్రాంతంలో 286.4 మీమీ వర్షం నమోదయిందని ముంబయి సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కెఎస్ హోసలికర్ ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో ముంబయిలో ఇదే అత్యధిక వర్షపాతమని తెలిపారు. భారీ వర్షాల నేపధ్యంలో సహాయక చర్యలు కోసం స్థానిక, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అయన తెలిపారు.

నిలిచిపోయిన హైకోర్టు కార్యకలాపాలు
ముంబయిలో కురిసిన భారీ వర్షాలతో బాంబే హైకోర్టులో కార్యకలాపాలు సైతం నిలిచిపోయాయి. ఈ రోజు సినీ నటి రియా చక్రవర్తి, ఆమో సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్లపై చివారణ జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడ్డాయి.
(ముంబయిలో కురిసిన భారీ వర్షాలకు చెరువును తలపిస్తున్న రహదారులు)
గత ఇరవై నాలుగు గంటల్లో ముంబైలోని పశ్చిమ ప్రాంతం(శాంతాక్రజ్ అబ్జర్వేటరీ)లో 286.4 మి.మీ., కొలాబా అబ్జర్వేటరీ(సౌత్ ముంబై)మేర వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇంతకంటే భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా వర్షాల ధాటికి లోతట్లు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ కష్టాలను వివరిస్తూ, సాయం చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Mumbaikars, train services on Central & Harbour lines have been suspended due to water logging following the heavy rainfall yesterday. However, Western Railway is functioning as usual.#MumbaiRains#MyBMCUpdates
— माझी Mumbai, आपली BMC (@mybmc) September 23, 2020