AP: కాకినాడ న‌గ‌ర మేయ‌ర్‌గా సుంక‌ర శివ‌ప్ర‌స‌న్న

తూర్పుగోదావ‌రి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ న‌గ‌ర మేయ‌ర్‌గా సుంక‌ర శివ‌ప్ర‌స‌న్న‌, డిప్యూటి మేయ‌ర్‌గా మీసాల ఉద‌య్‌కుమార్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం శివ‌ప్ర‌స‌న్న మీడియాతో మాట్లాడుతూ.. న‌గ‌ర అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని తెలిపారు. న‌గ‌ర ఎమ్మెల్యె ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
ఇప్పటి వరకు మేయర్‌గా ఉన్న సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. ఆమెను తొలగిస్తూ ఈ నెల 12న గెజిట్‌ నోటిఫికేషన్‌ను ప్ర‌భుత్వం ‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం ఎన్నికలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.