వల్లభ్ భాయ్ పటేల్ స్మారక జాతీయ పురస్కారం 2021 అందుకున్న డాక్టర్ పార్వతి సత్యనారాయణ

హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు.

మంచిర్యాల (CLiC2NEWS): పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని సాహిత్యం, విద్యా, వైద్యం,న్యాయ,పోలీస్, ఇంజనీరింగ్, పౌర, సామాజిక,సాంస్కృతిక, సేవా కార్యక్రమాలలో ధైర్యంగా తాము ఎంచుకున్న రంగాలలో విశిష్ట కృషి చేసిన, చేస్తున్న ప్రముఖులకు ఆదివారం CBI మాజీ జాయింట్ డైరెక్టర్ J.D.లక్ష్మినారాయణ పురస్కారాలు అంద‌జేశారు.

విద్యారంగంలో ఈ అవార్డును మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మామిడిపెల్లి గ్రామంలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేస్తున్న డాక్టర్ పార్వతి సత్యనారాయణ అందుకున్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా డాక్టర్ పార్వతి సత్యనారాయణ ఈ అవార్డు అందుకోవడం పట్ల మంచిర్యాల జిల్లా ఉపాధ్యాయులు, అతని వద్ద చదువు నేర్చుకున్న, నేర్చుకుంటున్న విద్యార్థులు, దండేపల్లి, ముల్కల్ల, పాత మంచిర్యాల, గంగాపూర్, శ్రీరాంపూర్ తదితర గ్రామాల, మండలాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

డాక్టర్ పార్వతి సత్యనారాయణ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా నియామకం అయినప్పటికీ నిరంతర విద్యార్థిగా ఉంటూ ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడుగా, ప్రధానోపాధ్యాయులుగా మరియు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకునిగా అంచెలంచెలుగా ఎదిగాడు. ఆ క్రమంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారందరూ ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా మార్గదర్శకత్వం చేసాడు. అతని విద్యార్థులు ఎన్నో రంగాలలో ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడి ఉన్నారు. ఎంతోమంది ఉపాధ్యాయులను అతడు ఉపాద్యాయ నాయకులుగా తయారుచేశాడు.

పాఠశాలల విషయానికి వస్తే ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తాను పాఠశాలలో ఉంటూ ఉపాధ్యాయులను కూడా అదనపు తరగతులు తీసుకునే విధంగా, అదనపు సేవలు అందించే విధంగా చైతన్యం చేస్తాడు. అతను ఏ గ్రామంలో పని చేసినా ఆ గ్రామంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్య అందుతుంది.   విద్యతో పాటు క్రమశిక్షణ వినయం, విధేయత అందిస్తూ ఉంటాడు. అతను స్వీయక్రమశిక్షణ పాటిస్తూ తోటివారిని, విద్యార్థులను ప్రభావితం చేస్తూ ఉంటాడు. అందుకే అతడు ఏ గ్రామంలో పని చేసిన ఆ గ్రామస్తులు అతన్ని ఎంతో అభిమానిస్తారు. అతనితో పనిచేసిన ఉపాధ్యాయులు అందరూ అతన్ని ఎంతో గౌరవిస్తారు. అతని వద్ద చదువుకున్న విద్యార్థులు అందరూ అతడిని దేవుడిగా చూస్తారు. ఒక ఉపాధ్యాయునిగా తన విధులు నిర్వహించడం సాధారణం కానీ విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రభావితం చేస్తూ వారి అందరి మెప్పును పొంది అనూహ్యమైన అభివృద్ధిని సాధించడం అసాధారణం, అది ఎంతో కృషి పట్టుదల దృఢమైన సంకల్పం ఉంటే గాని సాధ్యం కాదు, ఒక విజయం వెనుక ఎన్నో అపజయాలు వస్తూ ఉంటాయి, అపజయాలకు కుంగిపోకుండా వాటిని విజయాలుగా మలచడం దాని ఫలితాలను విద్యార్థులకు ఉపాధ్యాయులకు చూపించడంలో  డాక్టర్ పార్వతి సత్యనారాయణ దిట్ట. అతడు తను పనిచేసిన పాఠశాలల్లో చూపిన ఎన్నో విజయాలను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది పని చేయడం జరుగుతుంది. తన యొక్క ప్రభావం విద్యాభివృద్ధిలో ఉన్నది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, రాష్ట్రంలోనే తొలిసారిగా తాను ఇంగ్లీష్ మీడియం తన పాఠశాలలో నడిపి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నడపవచ్చు అని ఆలోచింప చేశారు. ఎన్నో జాతీయ వేదికలపైన ప్రసంగాలు చేసి తన ఆలోచనలు యావత్ దేశానికి తెలియజేశాడు, తద్వారా ఎంతోమంది అధికారుల, జాతీయ, రాష్ట్ర నాయకులను ఆలోచింప చేశారు.

అతను ఉక్కు లాంటి దృఢమైన సంకల్పం గల ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు.  ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విద్యా రంగం నుండి అతనికి పుడమి సాహితీ వేదిక ఈ అవార్డు  అందించడం ఆనందంగా ఉంది అని అతను ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని అతని అభిమానులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థినీ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవార్డు డాక్టర్ పార్వతి సత్యనారాయణకు అందించినందుకు పుడమి సాహితీ వేదిక నిర్వాహకులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, తన యొక్క సేవలను గుర్తించినందుకు పుడమి సాహితీ వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా తనకు ఈ అవార్డు రావడానికి కారణమైన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు, వివిధ గ్రామాల ప్రజలకు తాను రుణపడి ఉంటానని, మరింత నమ్మకంతో ఇంకా బాగా పనిచేస్తానని, విద్యా రంగ అభివృద్ధి కొరకు నూతన జాతీయ విద్యా విధానంను స్వాగతిస్తూ, దానిని  సంపూర్ణంగా విజయవంతం చేయడంలో తాను అహర్నిశలు కృషి చేస్తానని, ఉపాద్యాయుల అందరి సంక్షేమం కొరకు పాటుపడుతానని, విద్యా రంగ సమగ్ర అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడతానని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.