AP: ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండ‌లి స‌మావేశం

తిరుప‌తి(CLiC2NEWS): తిరుప‌తిలోని తాజ్ హోట‌ల్‌లో జ‌రుగుతున్న‌ 29వ స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశంకు ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్ర‌లు హాజ‌రయ్యారు. కేంద్ర హోంశాఖ‌ ‌మంత్రి అమిత్‌షా అధ్య‌క్ష‌త‌న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్‌ స్వాగత ఉపన్యాసంతో సమావేశం ప్రారంభ‌మ‌యింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి రంగ‌స్వామి, తెలంగాణ హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ, సిఎస్ సోమేవ్ కుమార్‌, త‌మిళ‌నాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇంఛార్జ్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, కేర‌ల రెవెన్యూ శాఖ మంత్రి రాజ‌న్‌, అండ‌మ‌న్ నికోబార్ ఎల్‌జి దేవేంద్ర కుమార్ జోషి, అక్ష‌ద్వీప్ అడ్మినిస్ట్రేట‌ర్ ప్పుల్ ప‌టేల్ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. సాస‌మావేశానికి హాజ‌రైన అతిథుల‌ను ఎపి సిఎం జ‌గ‌న్ స‌త్క‌రించారు.

Leave A Reply

Your email address will not be published.