పెన్సిలే కదా అని చులకన చేయకు..

“కత్తి కంటే కలం గొప్పది” అంటారు. కానీ ఆ కలానికి తొలి అడుగు వేసింది పెన్సిల్.

మనిషి ఆలోచనను అక్షరంగా మార్చిన తొలి మిత్రుడు పెన్సిల్. చిన్నారి చేతిలో అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టేది, శాస్త్రవేత్త చేతిలో కొత్త ఆవిష్కరణకు రూపమిచ్చేది, చిత్రకారుడి ఊహలకు రంగులు అద్దేది, ఇంజినీర్ కలలను నమూనాలుగా మార్చేది కూడా పెన్సిలే కదా… తప్పును చెరిపేసి మళ్లీ సరిదిద్దుకునే అవకాశాన్ని నేర్పే గురువు కూడా పెన్సిల్.

ఈ రోజు ఆధునిక పెన్సిల్ రూపకల్పనలో విశేష కృషి చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త నికోలస్-జాక్ కాంటే (Nicolas-Jacques Conté) జయంతి. గ్రాఫైట్‌కు మట్టి (క్లే)ని కలిపి వివిధ గట్టిదనాల పెన్సిళ్లను తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేసి, ప్రపంచవ్యాప్తంగా పెన్సిల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన మహనీయుడు ఆయన.

నేడు విద్య, విజ్ఞానం, కళ, సాంకేతిక రంగాల్లో పెన్సిల్‌కు ఉన్న అపారమైన ప్రాధాన్యత వెనుక కాంటే చేసిన ఆవిష్కరణ చిరస్థాయిగా నిలిచిపోయింది.పెన్సిల్ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని కూడా చెబుతుంది.తప్పు చేయడం సహజం, దాన్ని సరిదిద్దుకోవడం గొప్పది; మన విలువ బయట రంగులో కాదు, లోపల ఉన్న సారంలో ఉంది.

-ఎస్.వి.రమణా చారి,
సీనియర్ జర్నలిస్ట్
సెల్‌: +91 98498 87086

Leave A Reply

Your email address will not be published.