భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవును చంపిన పెద్ద పులి
కొత్తగూడెం (CLiC2NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాలలో పులి సంచరిస్తోంది. ఇక్కడ ఓ ఆవును ఓ పెద్దపులి చంపేసింది. ఈ వార్తతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లొద్దని, పశువులను ఆరు బయట కట్టేయొవద్దని సూచించారు. పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు.