ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ 27 భాషల్లో..
హైదరాబాద్(CLiC2NEWS): ఉస్మానియా యూనివర్సిటి వెబ్‌సైట్‌ను 27 భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఒయు వెబ్‌సైట్‌లోని సమాచారం ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉండేది. ఓయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి. నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఐటి బృందం 27 భాషల్లో వబ్సైట్ను రూపొందించారు. ఈ యూనివర్సిటీలో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు దాదాపు 90 దేశాల విద్యర్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారందరికీ వీలుగా వారి మాతృభాషలో ఒయు సమాచారాన్ని పొందే వీలు కల్పించాలని 27 భాషల్లో వెబ్‌సైట్‌ను రూపొందించారు.