వ‌ర‌ద బాధితులకు ఎపి స‌ర్కారు సాయం..

హైద‌రా‌బాద్ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు ఉచితంగా నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఎపి ‌లో కురుస్తున్న‌ భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు కార‌ణంగా ప‌లు జిల్లాలోని ప్ర‌జ‌లు జ‌ల‌దిగ్బందంలో చిక్కుకుని అనేక మంది నిరాశ్ర‌యుల‌య్యారు.  వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజి కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజి ఉల్లిగడ్డలు, కేజి బంగాళాదుంపలను పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేయాల‌ని సూచించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల క‌లెక్ల‌ర్లు తగు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి బి. ఉషారాణి ఆదేశాలు జారీ చేశారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా నెల్లూరు, క‌డ‌ప‌, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లో భారీగా ఆస్తి, పంట న‌ష్టం వాటిల్లిన విష‌యం తెలిసిన‌దే.

Leave A Reply

Your email address will not be published.