TS: గురుకుల పాఠ‌శాల‌లో 43 మందికి క‌రోనా

ప‌టాన్‌చెరు (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరు మండ‌లం ముత్తంగి గురుకుల పాఠ‌వాల‌లో క‌రోనాక‌ల‌క‌లంరేగింది. 42 మంది విద్యార్థుల‌కు, ఒక ఉపాధ్యాయురాలికి క‌రోనా పాజివ్ బారిన ప‌డ్డారు. ఈ గురుకుల పాఠ‌శాల‌లో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న (ఆదివారం ) 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వారిలో 43 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. మిగ‌తా విద్యార్థుల‌కు ఇవాళ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. కాగా పాజిటివ్ వ‌చ్చిన వారికి వ‌స‌తిగృహంలోనే క్వారంటైన్లో ఉంచి వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు. కాగా క‌రోనా సోకిన వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యారోగ్య‌శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.