Dollar Seshadri: డాలర్ శేషాద్రి కన్నుమూత
విశాఖపట్టణం (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఇవాళ తోల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం రాత్రి 8 గంటలకు కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖకు వచ్చిన ఆయన టిటిడి కల్యాణ మండపంలో జరిగిన స్వామి వారి పవళింపు సేవలో పాల్గొన్నారు. అనంతరం టిటిడి ఉద్యోగులతో కాసేపు మాట్లాడి.. కల్యాణ మండపంలోనే బస చేశారు. ఈ క్రమంలో సోమవారం వేకువజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఆంధ్రా మెడికల్ కాజేజ్ అనాటమి నుంచి శేషాద్రి భౌతిక కాయాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. రేపు గోవిందధామంలో శేషాద్రి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
డాలర్ శేషాద్రి 1978 నుంచి తిరుమల శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టిటిడి తిరిగి ఓఎస్డీగా కొనసాగింది.
టిటిడికి తీరని నష్టం.. టిటిడి అదనపు ఇఒ ధర్మారెడ్డి
డాలర్ శేషాద్రి మరణం టిటిడికి తీరని నష్టమని టిటిడి అదనపు ఇఒ ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.