ఇరు దేశాల మ‌ధ్య బంధం సుస్థిరం: ప్ర‌ధాని మోడి

ఢిల్లీ(CLiC2NEWS) : ‌భార‌త్‌, ర‌ష్యా దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక ఒప్పందాల స‌ద‌స్సులో భాగంగా న‌రేంద్ర మోడి, ర‌ష్యా అధ్య‌క్ష‌డు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు ప్ర‌ధాని మోడి స్వాగ‌తం ప‌లికారు. ఇరుదేశాల నేత‌లు ర‌క్ష‌ణ‌, వాణి‌జ్యం, పెట్టుబ‌డులు ,ఆఫ్గానిస్థాన్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. ఈసంద‌ర్భంగా ప్ర‌ధాని మోడి మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా ఎన్ని విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్ప‌టికీ భార‌త్-ర‌ష్యాల మ‌ధ్య సంబంధాల‌లో ఎలాంటి మార్పు రాలేద‌ని తెలిపారు. సంక్షోభ స‌మ‌యంలో కొవిడ్ వ్యాక్సిన్‌ల‌తో పాటు ఇరు దేశాలు స‌హాయ స‌హ‌కారాలు అందించుకున్నాయ‌ని గుర్తుచేశారు.

భార‌త్ న‌మ్మ‌క‌మైన మిత్ర దేశ‌మ‌ని, ఇరుదేశాల మ‌ధ్య సంబంధాలు పురోభివృద్ధిలో ఉన్నాయ‌ని , భ‌విష్య‌త్తులో కూడా ఈవిధంగానే కొన‌సాగుతాయ‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వెల్ల‌డించారు. ముఖ్యంగా ఉగ్ర‌వాదుల‌కు నిధులు , డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా వంటి ఉగ్ర‌వాదాన‌కిసంబందించిన అంశాల‌పై ఇరు దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయ‌ని గుర్తుచేశారు.

Leave A Reply

Your email address will not be published.