ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాలపై ఏడాది పాటు నిషేధం
అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుండి ఒక సంవత్సర కాలంపాటు పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాలపై నిషేధం విధించింది. ఈమేరకు ఎపి కుటుంబ, సంక్షేమ , ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార పదార్ధాలను ఏ పేరుతో నైనా తయారు చేయడం, అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం వంటివి నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు.