ఆర్టిసి బస్సులో జన్మించిన ఇద్దరు ఆడపిల్లలకు బంపర్ ఆఫర్.. సజ్జనార్
హైదరాబాద్(CLiC2NEWS) : ఆర్టిసి ఎండి సజ్జానార్ ఆర్టిసి బస్సుల్లో జన్మించిన ఇద్దరు ఆడపిల్లలకు జన్మదిన కానుక ప్రకటించాడు. వారు జీవితకాలం బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే ‘లైఫ్ టైమ్ ఫ్రీ బస్ పాస్’ ఇచ్చినట్లు తెలిపారు. నవంబర్ 30వ తేదీన ఒక మహిళ, డిసెంబరు 7వ తేదీన ఒక మహిళ ఆర్టిసి బస్సు ల్లో ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఈ ఇద్దరు ఆడ పిల్లలకు కానుకగా.. ఉచిత జీవితకాల పాస్‌లను మంజూరు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.