జ‌ల‌మండ‌లి ఉద్యోగులకు హెల్త్‌కార్డుల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు

‌హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌భుత్వం అందించిన హెల్త్ కార్డుల‌ను వినియోగించుకునే విధానంపై, హెల్త్ కార్డుల ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలపై జ‌ల‌మండ‌లి ఉద్యోగుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. గోషామ‌హ‌ల్‌లోని జ‌ల‌మండ‌లి డిస్పెన్స‌రీలో గురువారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీంతో పాటు య‌శోద‌ హాస్పిట‌ల్ సౌజ‌న్యంతో వైద్య శిబిరం కూడా నిర్వ‌హించారు. ఇందులో జ‌ల‌మండ‌లి సిబ్బందికి వివిధ వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది. సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి ప‌ర్స‌న‌ల్ డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్‌బాబు, సీజీఎం ఎంఏ ఖాద‌ర్‌, జ‌ల‌మండ‌లి ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.