కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొన్న‌కారు.. ఆరుగురు మృతి

కామారెడ్డి(CLiC2NEWS):  జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఆగివున్న లారీని కారు ఢీకొన్నది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రోన‌లుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. జిల్లాలోని బిచ్కుంద మండ‌లం జ‌గ‌న్నా‌థ‌ప‌ల్లి గేట్ వ‌ద్ద జాతీయ ర‌హదారిపై ఆగి వున్న లారీని ‌కారు ఢీకొన్న‌ది. మ‌రిణించిన‌ల వారిలో ఇద్ద‌రు చిన్నారులు, ఇద్దరు మ‌హిళ‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థాల‌నికి చేరుకుని స‌హాక చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతుల వ‌ద్ద ఉన్న గుర్తింపు కార్డ‌ల ఆధారంగా వివ‌రాల‌ను సేక‌రించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.