ముంబ‌యిలో ఒక్క‌రోజే 2,510 కొవిడ్ కేసులు..

ముంబ‌యి (CLiC2NEWS): మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబ‌యిలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న‌వి. తాజాగా ముంబ‌యిలో 2,510 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. అక్క‌డ కొత్త కేసుల‌తో క‌లిపి యాక్టివ్ కేసుల సంఖ్య 8,060కి పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో కేసుల సంఖ్య 82% పెరిగిన‌వి.  ముంబ‌యిలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయ‌ని, వారం రోజుల క్రితం 150 కేసులు మ‌త్ర‌మే వ‌చ్చేవ‌ని, కేవ‌లం ఒక్క‌రోజులో 2 వేలు దాటే అవ‌కాశం ఉంద‌ని మంత్రి ఆదిత్య ఠాక్రే ముందే వెల్ల‌డంచారు. కొంత స‌మ‌యంలోనే అధికారులు కొవిడ్ కేసులు 2,510 న‌మోద‌యిన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అధికారుల‌ను, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.