జ‌న‌వ‌రి 1 నుండి ‘పిఎం కిసాన్’ సాయం..

 ఢిల్లి (CLiC2NEWS): కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త తెలిపింది. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి (పిఎం కిసాన్‌) ప‌థ‌కం ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులు జ‌న‌వ‌రి 1వ తేదీనుండి జ‌మ‌చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. పిఎం కిసాన్ ప‌థ‌కానికి సంబంధించిన 10వ విడ‌త నిధులను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌న‌వ‌రి 1వ తేది మ‌ధ్య‌హ్నం నుండి విడుద‌ల చేస్తార‌ని పిఎంఓ తెలిపింది. దాదాపు 10 కోట్ల మంది రైతుల‌కు రూ. 20వేల కోట్లను జ‌మ‌చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. సంవ‌త్స‌రానికి మూడు విడ‌తల్లో రైతుల ఖాతాల్లో  జ‌మ చేస్తున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1.6ల‌క్ష‌ల కోట్ల‌ను రైతుల ఖాతాల్లోకి నేరుగా జ‌మ‌చేసిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.