`రాధేశ్యామ్‌` వాయిదా

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్న‌ నేప‌థ్యంలో భారీ సినిమాలు ఒక్కొక్క‌టిగా వాయిదా ప‌డుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. అదే కోవ‌లోకి మ‌రో పాన్ ఇండియా సినిమా కూడా చేరింది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్` చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాధేశ్యామ్ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు యూవీ క్రియేష‌న్స్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. ఈ సినిమా జ‌న‌వ‌రి 15న రిలీజ్ కావాల్సి ఉంది. పామాల‌జిస్ట్‌గా ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.