మున్నేరు ప్రాంతంలో ఐదుగురు చిన్నారులు గ‌ల్లంతు..!

కృష్ణా (CLiC2NEWS) : జిల్లాలోని చంద‌ర్ల‌పాడు ఏటూరు గ్రామం మున్నేరు ప్రాంతంలో ఐదుగురు పిల్ల‌లు క‌నిపించ‌కుండా పోయారు. గ్రామానికి చెందిన‌ 8 నుండి 13 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగిన పిల్ల‌లు మున్నేరు వైపు వెళ్లారు. చీక‌టిప‌డినా పిల్ల‌లు ఇంటికి రాక‌పోయే స‌రికి త‌ల్లి దండ్రులు ఆందోళ‌న‌కు గురై గాలిస్తున్నారు. పిల్ల‌ల బ‌ట్ట‌లు, సైకిళ్లు మున్నేరు ఒడ్డున క‌నిపించ‌డంతో ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. స్థానికి ఎమ్మెల్యే జ‌గ‌న్మేహ‌న‌రావు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని గాలింపు చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.